
- కలెక్టర్ మనుచౌదరి
గజ్వేల్, వెలుగు: గజ్వేల్గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ మనుచౌదరి డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోనిమాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నెలకు 350 నుంచి 400 వరకు ప్రసవాలు జరుగుతున్నందున వాటికి తగినట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రసవాలలో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామ పరిధిలోని పలుగడ్డ శివారులో గల 400 ఎకరాల టీజీఐఐసీ ల్యాండ్ ను పరిశీలించారు. ల్యాండ్ చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో చంద్రకళ, డీసీహెచ్ వో అన్నపూర్ణ, అధికార్లు ఉన్నారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
సిద్దిపేట రూరల్: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. మండలంలోని పుల్లూరు గ్రామంలోని ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు గన్నీ బ్యాగులు, లారీలు, టార్ఫాలిన్ కవర్లను అందజేయాలని కోరగా సివిల్ సప్లై డీఎం,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్నుంచి లైసెన్స్ డ్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్వెంకట రెడ్డి, ఎంపీడీవో మురళీధర్ శర్మ, ఎంపీవో విష్ణు ఉన్నారు.