ఖమ్మం టౌన్, వెలుగు: చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన చిన్నారి పోస్టర్ ను కలెక్టర్ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల అక్రమరవాణా, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, ఆన్ లైన్ వేధింపులు, మాదక ద్రవ్యాలు మొదలగు అంశాల నివారణ, పిల్లలలో వచ్చే శరీర మార్పులు, గుడ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన సంబంధిత అంశాలను వివరిస్తూ గోడ ప్రతులను రూపొందించి, అందరిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
3చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు శ్రీజ, మధుసూదన్ నాయక్, డీఆర్డీవో సన్యాసయ్య, డీఆర్డీవో రాజేశ్వరి, జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, డీసీపీవో విష్ణువందన, అధికారులు పాల్గొన్నారు.