పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాప్ను సీజ్ చేయండి..డీఏవోను ఆదేశించిన కలెక్టర్

పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాప్ను సీజ్ చేయండి..డీఏవోను ఆదేశించిన కలెక్టర్
  • పోతిరెడ్డిపల్లిలోని దుకాణంలో తనిఖీలు

సంగారెడ్డి, వెలుగు: మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్​ ఎరువుల దుకాణాన్ని సీజ్​చేయాలని డీఏవో శివప్రసాద్​ను కలెక్టర్​ప్రావీణ్య ఆదేశించారు.  బుధవారం ఈ షాప్​ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ రైతుతో ఫోన్ లో మాట్లాడగా.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు విక్రయిస్తున్నట్లు చెప్పడంతో చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవోలు తదితరులు పాల్గొన్నారు ..

ఫేస్ ​రికగ్నిషన్​ ద్వారా పెన్షన్ 

ఫేస్​ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) ద్వారా పెన్షన్లు ఇవ్వడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. బుధవారం పోతిరెడ్డిపల్లి వార్డు ఆఫీస్​ను సందర్శించారు. ముఖ గుర్తింపుతో పింఛన్ ఇస్తున్నామని, ఇది వేలిముద్రలు రాని వృద్ధులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని తెలిపారు. అడిషనల్​డీఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.