ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ సాఫీగా నిర్వహించండి : కలెక్టర్ విజయేందిర బోయి

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ సాఫీగా నిర్వహించండి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఈనెల 22 నుంచి 29 వరకు  నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సాఫీగా నిర్వహించాలని మహబూబ్​నగర్​ కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను  ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఫస్ట్​ ఇయర్​లో 5787 మంది, సెకండ్​ ఇయర్​స్టూడెంట్స్​3282 మంది కాగా, మొత్తం 9069 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

 పర్మిషన్లు లేట్ చేయొద్దు..

జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు టీజీ ఐపాస్ ద్వారా వివిధ శాఖల నుంచి మంజూరు చేయవలసిన అనుమతులను లేట్ చేయకుండా వెంటనే ఇవ్వాలని కలెక్టర్ విజయేందిర బోయి  అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిబందనలు పాటిస్టూ గడువులోగా పర్మిషన్లు ఇవ్వాలని సూచించారు. టీ ఫ్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ తెగలకు చెందిన నలుగురికి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద వాహనాలకు పెట్టుబడి, సబ్సిడీ మంజూరు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది. 

వృత్తి  నైపుణ్యాలు పెంచుకోవాలి.. 

విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు టీచర్లు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మహబూబ్​నగర్​ జేపీఎన్​ఈఎస్​ భవనంలో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, మెరుగైన పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఐఈవో కౌసర్ జహాన్, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్, టీజీ ఐఐసీ డి.డి.గణేశ్, సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ వెంకట నర్సమ్మ, డీఈవో ప్రవీణ్ కుమార్, ఏఎంవో దంకుడు శ్రీనివాస్, సీఎంవో బాలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. చండి