గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి : ప్రావీణ్య

గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి : ప్రావీణ్య
  • అధికారుల సమావేశంలో  కలెక్టర్ ప్రావీణ్య 

హనుమకొండ సిటీ, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో  గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ గురించి హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్, పరకాల నియోజకవర్గ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ ప్రక్రియ పురోగతి పై పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ కలెక్టర్ కు వివరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ..  భూసేకరణ మొదటి దశలో గుర్తించిన రైతులకు జూన్ 30 నాటికి పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  వివిధ ప్రాంతాల్లో రైల్వే శాఖకు అందించాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.  సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ డీఈ చైతన్య, ఆర్ అండ్ బీ ఈఈ సురేశ్ బాబు, నేషనల్ హైవే ఆఫీసర్లు, తహసీల్దార్లు విజయ లక్ష్మీ, జ్యోతి వరలక్ష్మి దేవి, జగన్ మోహన్ రెడ్డి, బావ్ సింగ్, సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

శిక్షణలో సర్వే అంశాలను తెలుసుకోవాలి

హనుమకొండ సిటీ, వెలుగు:  లైసెన్స్  సర్వేయర్ శిక్షణా కార్యక్రమంలో  సర్వేకు సంబంధించిన అంశాలను  క్షుణ్ణంగా తెలుసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.  మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రం (టీటీడీసీ)లో జిల్లా  సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ..  లైసెన్స్ సర్వేయర్లకు 50 రోజులపాటు నిర్వహించే ట్రైనింగ్‌లో సర్వేకు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు సాధించాలన్నారు.  

ట్రైనింగ్ అనంతరం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. భూవివాదాలు పరిష్కరించేందుకు  ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు.  ఫీల్డ్ సర్వే తో భూ వివాదాలు పరిష్కారమవుతయన్నారు.  ట్రైనింగ్ అనంతరం ఎగ్జామ్  నిర్వహించి  ప్రతిభ కనబరిచిన వారికి భూభారతి  సర్వే చేసేందుకు అవకాశం ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయిలో బాగా పనిచేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో  ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.