ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి : పి.ఉదయ్ కుమార్  

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి : పి.ఉదయ్ కుమార్  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్  అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  పి.ఉదయ్ కుమార్  అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అవసరమైన ఇసుక రీచ్​లు అందుబాటులో ఉన్నాయని, కొత్త రీచ్ లను ప్రజల అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావాలని, ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు.

జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత పోలీస్  శాఖదేనన్నారు. ఇసుక అక్రమంగా తరలించే ట్రాక్టర్లు, టిప్పర్లను సీజ్ చేయాలని, ఓనర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్  సీతారామారావు, మైనింగ్​ ఏడీ సాంబశివరావు, డీఎస్పీలు పాల్గొన్నారు