కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఈనెల 7న నిర్వహించనున్న కాన్వొకేషన్‌కు చీఫ్ గెస్ట్‌గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారని, ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీసీ ఉమేశ్‌కుమార్, అధికారులతో గవర్నర్ పర్యటనపై కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నర్ పర్యటనను సక్సెస్ చేయాలన్నారు.
యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. వీసీ మాట్లాడుతూ 2018 నుంచి 2023 వరకు యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు గవర్నర్ 161 గోల్డ్ మెడల్, 25 పీహెచ్‌డీ పట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీసీపీ వెంకటరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
