కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను స్పీడప్ చేసి, డిసెంబర్ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి పనులను పరిశీలించారు. వినియోగదారులకు మార్కెట్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో మాట్లాడారు.
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారా అని అడిగారు. మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక క్యాంపుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజయ్ కుమార్ తదితరులున్నారు.
