పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : పమేలా సత్పతి

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి :  పమేలా సత్పతి
  • సెంటర్లలో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి

చొప్పదండి, వెలుగు : రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. చొప్పదండి మండలం వెదురుగట్టలో శ్రీరామ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెంటర్లలో రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.

గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు సెంటర్లలోనే వడ్లు అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌‌‌‌‌‌‌‌, జిల్లా అగ్రికల్చర్​ఆఫీసర్​ శ్రీనివాస్, డీసీఎస్‌‌‌‌‌‌‌‌వో గౌరీ శంకర్, సివిల్ సప్లై డీఎం రజనీకాంత్, అడిషనల్‌‌‌‌‌‌‌‌ డీఆర్డీవో సునీత, డీపీఎం ప్రవీణ్, ఏపీఎం నర్మదా తదితరులు పాల్గొన్నారు. 

జమ్మికుంట ఓల్డ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో.. 

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ప్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రెడ్డి నాయక్  సోమవారం ప్రారంభించారు. 

కోతలకు ముందే కొనుగోలు సెంటర్లు 

సుల్తానాబాద్, వెలుగు :  వరి కోతలకు ముందే ముందే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌‌‌‌‌‌‌‌లాల్ అన్నారు. ప్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 10లోపు 305 సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, డీసీవో శ్రీమాల, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ సెక్రటరీ హమీద్, సొసైటీ సీఈవో సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.