ప్రైవేట్‌‌‌‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో రిజల్ట్స్ : పమేలాసత్పతి

ప్రైవేట్‌‌‌‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో రిజల్ట్స్ : పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్స్‌‌‌‌  టెన్త్‌‌‌‌లో మంచి రిజల్ట్స్‌‌‌‌ సాధించారని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి ప్రశంసించారు. శనివారం టౌన్‌‌‌‌లో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్‌‌‌‌ ఫంక్షన్ హాల్‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్, రాజన్నసిరిసిల్ల  జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో 10జీపీఏ సాధించిన 120మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్‌‌‌‌తోపాటుతో పాటు రూ.3వేల  నగదు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇష్టపడి శ్రమిస్తే  విజయం మన సొంతమవుతుందని లక్ష్యం  సాధించే  వరకు  విశ్రమించొద్దన్నారు. అందుకు సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన  సాయికిరణ్​, సహనలే  నిదర్శనమన్నారు. జిల్లాలోని  88 ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లలో 100 శాతం పాస్ అయితే, గవర్నమెంట్ స్కూళ్లలో 84శాతం ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు.  

10 జీపీఏ సాధించిన విద్యార్థులకు వెంకట్ ఫౌండేషన్ సభ్యులు అవార్డులు అందించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు స్థానిక భాగ్యనగర్,  సరస్వతినగర్‌‌‌‌‌‌‌‌లో మెప్మా ఆధ్వర్యంలో యూనిఫామ్స్  కుట్టు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో  పెద్దపల్లి అడిషనల్‌‌‌‌ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, సివిల్స్ ర్యాంకర్లు నందాల సాయికిరణ్​, కొలనుపాక సహన, వెంకట్ ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్,  వైస్ ప్రెసిడెంట్ జయరాములు,  సెక్రటరీ  సతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ కమిషనర్  స్వరూపరాణి పాల్గొన్నారు.