లింగ నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ ప్రావీణ్య

లింగ నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ ప్రావీణ్య

కాశీబుగ్గ, వెలుగు: సిటీలో లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్​లో పీసీఅండ్​పీడీటీ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ మీటింగ్​లో కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో డేకాయ్ ఆపరేషన్స్ చేపట్టాలని తెలిపారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. .

గ్రామస్థాయిలో ఆశలు, ఏఎన్ఎంలు, అంగన్​వాడీ కార్యకర్తలు గర్భిణులకు లింగ వివక్షతపై అవగాహనతోపాటు వారిపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అవగాహన పోస్టర్లను, బ్యానర్లను ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం 2,36,488 మంది పిల్లలకు మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో సాంబశివరావు, ఏసీపీ దేవేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.