విద్యా వ్యవస్థకు పటిష్టమైన చర్యలు : కలెక్టర్ పింకేశ్ కుమార్

విద్యా వ్యవస్థకు పటిష్టమైన చర్యలు : కలెక్టర్ పింకేశ్ కుమార్

జనగామ అర్బన్, వెలుగు: విద్యా వ్యవస్థకు పటిష్టమైన చర్యలు చేపట్టామని, ఆమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేస్తామని, ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జనగామ ఇన్​చార్జి కలెక్టర్​ పింకేశ్​ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్​లో విద్యా వ్యవస్థ పటిష్టత కొరకు తీసుకుంటున్న చర్యలను హైదరాబాద్​ నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ యోగితా రాణా ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సమీక్షలో జనగామ కలెక్టర్​ పాల్గొని జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపై వివరించారు. 

అనంతరం రాష్ర్ట చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నిర్వహించిన కాన్ఫరెన్స్​లో కలెక్టర్​ జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలపై వివరించారు. ఇదిలా ఉండగా, జిల్లాలో 280 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ప్రైవేట్​ దుకాణాల్లో 200 టన్నులు ఉండగా, మరో 500 టన్నులు రేపటికి ఎన్ఎఫ్ఎల్​ కంపెనీ నుంచి చేరుకోనున్నదని కలెక్టర్​ తెలిపారు. రేపటి నుంచి రైతులకు యూరియా అందుబాటులో ఉంటుందని చెప్పారు.​​