
- జనగామ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పింకేశ్ కుమార్
బచ్చన్నపేట, వెలుగు : ఆరోగ్యానికి ప్రధానం కారణం స్వచ్ఛతనేనని జనగామ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. గురువారం బచ్చన్నపేటలో చౌరస్తాలో విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారం, ర్యాలీలో ఆయన పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హైస్కూల్లో సుమారు ఆరు వందల మంది కలిసి శ్రమదానం చేశారు.
రంగోళి, చిత్రలేఖం, పోటీలు తిలకించి విజేతకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ స్వచ్ఛత పాటించాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, అదే అందరి నినాదం అని తెలిపారు. అనంతరం పీఏసీఎస్ గోదాముల్లో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్రిజిస్టర్లను పరిశీలించారు.
రైతులకు ఇబ్బందులు కల్గకుండా యూరియా పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్ చేరుకొని ఆఫీసర్లతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్పనులు వేగవంతం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీపీవో స్వరూపారాణి, ఎంపీడీవో మమతాబాయ్, ఎస్బీఎం డీసీ కరుణాకర్, ఎంపీవో మల్లికార్జున్, ఏవో విద్యాకర్‌రెడ్డి, సీఈవో బాలస్వామి, హెచ్ఎం వెంకట్‌రెడ్డి, ఆఫీసర్లు పాల్గొన్నారు.
పది ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
జనగామ అర్బన్, వెలుగు : పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జనగామ ఇన్చార్జి కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌నుంచి ఎంఈవోలతో గూగుల్‌మీట్ ద్వారా పాఠశాలల ప్రగతిపై సంబంధిత విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డులేని విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్‌లోనే ఉన్నారని, హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు.
దిక్సూచి ప్రోగ్రాంలోని ప్రతి అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. డిజిటల్ బుక్స్ పంపిణీ పూర్తి చేయాలని, ఉల్లాస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలలన్నారు.