
సిద్దిపేట రూరల్, వెలుగు : అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోవాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లీడ్ బ్యాంక్ ఆఫీసర్లతో బుధవారం కలెక్టరేట్‌లో మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా టార్గెట్ రూ.5,920.29 కోట్లు కాగా, రూ.4,305.69 కోట్ల టార్గెట్ చేరుకున్న బ్యాంకర్లను అభినందించారు. అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా పాల్గొన్నారు.