పంద్రాగస్టు వేడుకలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ ప్రావీణ్య

పంద్రాగస్టు వేడుకలను పక్కాగా నిర్వహించాలి :  కలెక్టర్ ప్రావీణ్య
  •  కలెక్టర్ ​ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: పంద్రాగస్టు వేడుకలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్​ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో  వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ​మాట్లాడుతూ.. వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని, వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలన్నారు. వైద్య బృందం,108 అంబులెన్స్ ను వేడుక వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలన్నారు. 

అన్ని శాఖల శకటాల ప్రదర్శనతో పాటు స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలన్నారు.  అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, సీపీవో బాలశౌరి పాల్గొన్నారు.

పిల్లలందరూ అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి

1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరూ అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. నేషనల్ డీ వార్మింగ్ డే ను పురస్కరించుకొని పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ స్కూల్​లో చేపట్టిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నులిపురుగుల కారణంగా పిల్లలఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. వాటి నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలన్నారు.

 అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, అంగన్వాడీ కేంద్రాల్లో అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సోమవారం మిస్పయిన పిల్లలకు ఈనెల 19 వరకు ఇంటింటికీ తిరిగి మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. ఆమె వెంట డీఎంహెచ్​వో నాగ నిర్మల, టీచర్లు, సిబ్బంది ఉన్నారు.