పార్లమెంట్‌‌ ఎన్నికల్లో నిబద్ధతతో పనిచేయాలి : ప్రియాంక

పార్లమెంట్‌‌ ఎన్నికల్లో నిబద్ధతతో పనిచేయాలి :  ప్రియాంక

సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్‌‌ ఎన్నికల్లో నిబద్ధతతో పనిచేయాలని అడిషనల్‌‌ కలెక్టర్  సీహెచ్ ప్రియాంక సూచించారు.  మంగళవారం కలెక్టరేట్‌‌లో ఎంసీసీ, ఎఫ్ఎస్‌‌టీ, ఎస్ఎస్‌‌టీ, వీవీటీ, ఫ్లయింగ్ స్క్వాడ్‌‌లకు ఎక్స్‌‌పెండిచర్ బుక్ చేయడంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆమె మాట్లాడుతూ ఎంసీసీ టీమ్స్ చెక్ పోస్టుల వద్ద మద్యం, నగదు రవాణా అరికట్టాలన్నారు.  

ఆధారాలు లేకుండా రూ. 50 వేల కంటే ఎక్కువ ఉంటే డబ్బులు పట్టుబడితే  సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి తెలపాలని ఆమె పేర్కొన్నారు.  బ్యాంకులకు సంబంధించిన  నగదు విషయంలో  క్యూఆర్ కోడ్ ఉంటుందని, ఫ్లయింగ్‌‌ స్క్వాడ్‌‌  కోడ్‌‌ను వదిలేయాలని సూచించారు.  సెక్టోరల్ అధికారులు ఈవీఎంలను తరలించేటప్పుడు ఎస్కార్ట్‌‌తో వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ విప్పర్ల రమేశ్, చందా శ్రీనివాస్  పాల్గొన్నారు.