
మెదక్ టౌన్, వెలుగు: వసతి గృహ సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం కొల్చారం బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, స్టోర్ రూమ్, మెనూ, వసతి గృహంలో మరుగుదొడ్లను పరిశీలించారు.
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా చేరిన విద్యార్థులపై దృష్టి పెట్టి విద్యార్థులతో కలిసి పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యతో పాటు క్రీడలపై ఆసక్తిని కల్పించాలని సూచించారు.