
అల్లాదుర్గం, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం ఆయన గడిపెద్దాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ముస్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను, గ్రామంలో శానిటేషన్ తీరును పరిశీలించారు. పశువైద్యశాలను, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. పీహెచ్సీలో స్టోర్, రక్త పరీక్ష గది, ఓపి రిజిస్టర్ పరిశీలించారు.
అనంతరం ముస్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే విధంగా లబ్ధిదారులును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. త్వరగా ఇండ్లు నిర్మించుకొని సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నారు. ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.