మెదక్ టౌన్, వెలుగు: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు. బుధవారం ఆయన మెదక్ కలెక్టరేట్లో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ..ఈ నెల 8 నుంచి 11వరకు పారిశుధ్యంపై గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టంపై, గ్రామపాలనపై శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎంపీడీవోలు, కార్యదర్శులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో డీపీవో యాదయ్య, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఎంపీడీవోలు, జీపీ సెక్రటరీలు పాల్గొన్నారు. అనంతరం మెడికల్ బిల్డింగ్అసోసియేషన్ఆధ్వర్యంలో డాక్టర్ శివదయాల్, డాక్టర్ విజయ్‌కుమార్500 దుప్పట్లను కలెక్టర్ రాహుల్ రాజ్‌కు అందజేశారు. ఆయా శాఖల అధికారులు సైతం కలెక్టర్‌కు దుప్పట్లను అందజేశారు.
బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అంధుల పాలిట వరం
బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అంధుల పాలిట వరమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, డీడబ్ల్యూవో హేమభార్గవి, జిల్లాలోని అందులతో కలిసి పాల్గొన్నారు. విద్య ద్వారా దివ్యాంగులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ లిపి మార్గదర్శకమన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
