
మెదక్‌టౌన్, వెలుగు : జీవాల పెంపకంతో ఉపాధి పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం మెదక్ మండలం బాలానగర్ లోని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాల పెంపకానికి సంబంధించిన షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కోటి రూపాయల వ్యయంతో యూనిట్ ప్రారంభిస్తే లబ్ధిదారు వాటా రూ.10 లక్షలు, బ్యాంకు రుణం రూ. 40 లక్షలు, యూనిట్ సబ్సిడీ రూ. 50 లక్షలు ఉంటుందని తెలిపారు.
మేకలు, గొర్రెల పెంపకంలో అనుభవం ఉండాలని, యూనిట్ ప్రారంభించి అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం పిల్లికొట్టాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని తనిఖీ చేశారు. మెడికల్ కాలేజీ క్యాంటీన్, ల్యాబ్, హాస్టల్ వసతులను పరిశీలించారు. స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక సౌకర్యాలతో విద్యా భోదన చేయాలని ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్ కు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డాక్టర్లు లక్ష్మణ్, వినోద్, మెడికల్‌కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ జయ, సూపరింటెండెంట్డాక్టర్ శివదయాల్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.