- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో రాణించాలని కలెక్టర్రాహుల్రాజ్పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన సీఎం కప్ టార్చ్ర్యాలీని అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మెదక్ పట్టణంలోని పోస్ట్‌ఆఫీసు నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమే ఈ క్రీడల ఉద్దేశ్యమన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణకు సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.
తాము ఎంచుకున్న క్రీడల్లో రాణిస్తే ప్రపంచ స్థాయి చాంపియన్లుగా ఎదగవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేశ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఎస్వో రాజిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రిన్సిపాళ్లు, పీఈటీలు పాల్గొన్నారు.
