పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్

తూప్రాన్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవాలు చేసేందుకు అభ్యర్థులను ఇబ్బందిపెడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన తూప్రాన్ మండలంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మొదటి విడత నామినేషన్ లో భాగంగా 6 మండలాల్లో ఈ రోజు స్క్రూటినీ నడుస్తుందన్నారు. రెండో విడతలో 8 మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. 

నామినేషన్స్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులను ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనాలన్నారు. రెండో విడతలో మొదటి రోజు 14 సర్పంచ్ స్థానాలకు,16 వార్డు మెంబర్ల స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లను అందజేశారని ఎంపీడీవో శాలిక తెలిపారు. ఎలక్షన్ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్, అడిషనల్ కలెక్టర్ నగేశ్ నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించారు. ఆర్డీవో జయచంద్రా రెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగాకృష్ణ, తహసీల్దార్​చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ శివానందం ఉన్నారు.