
భూపాలపల్లి రూరల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ ఆఫీస్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 70 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజా దివాస్ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్‌ఖరే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.