హైదరాబాద్ టు బెంగళూరు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. కలెక్టర్ రియాక్షన్ ఇదే !

హైదరాబాద్ టు బెంగళూరు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. కలెక్టర్ రియాక్షన్ ఇదే !

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపలోని హైవేపై జరిగిన ప్రమాదంలో.. 20 మంది ప్రయాణికులు మిస్సైనట్లు కలెక్టర్ చెప్పారు. 21 మంది సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. 

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. బస్సు పూర్తిగా దగ్ధమైందని.. బస్సులో నుంచి 11 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు చెప్పారు.  మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున 3  నుంచి 3.-10 గంటల సమయంలో బస్సు బైక్ ను ఢీకొనడంతో ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. 

బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు  వివరాల కోసం కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్  నం. 08518-277305 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చునని కలెక్టర్ తెలిపారు. 

►ALSO READ | బస్సు ప్రమాదం తరువాత..కూకట్ పల్లిలో వేమూరి కావేరి ట్రావెల్స్ ఆఫీసు మూసివేత.. సిబ్బంది పరారీ

 హైదరాబాద్ నుంచి బెంగళూరు  వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఏపీ కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.  శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బస్సు మంటల్లో దగ్ధమైపోయింది. కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. 

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు.  21 మందికి పైగా మృతి చెందగా మరో మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక  చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.