‘దామిని’ యాప్‌‌‌‌‌‌‌‌ను వినియోగించాలి : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

‘దామిని’ యాప్‌‌‌‌‌‌‌‌ను వినియోగించాలి : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు:  పిడుగుల ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు అందించే ‘దామిని లైట్నింగ్ అలర్ట్’ యాప్‌‌‌‌‌‌‌‌ను ప్రజలందరూ వినియోగించాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. పిడుగుల కారణంగా సంభవించే ప్రమాదాల నుంచి అప్రమత్తంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్‌‌‌‌‌‌‌‌లో డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవాలన్నారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌‌‌‌‌‌‌‌లో ఈ యాప్ ఉచితంగా అందుబాటులో ఉందని, డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, చిరునామా తదితర వివరాలతో నమోదు చేసుకుని జీపీఎస్​లొకేషన్‌‌‌‌‌‌‌‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.  

దీనివల్ల వినియోగదారుడు ఉన్న ప్రాంతం చుట్టూ 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగులు పడే పరిస్థితిని ఈ యాప్ పర్యవేక్షిస్తూ, 30 నుంచి 45 నిమిషాల ముందే అవసరమైన హెచ్చరికలు అందిస్తుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఈవీఎం గోడౌనును సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతను పరిశీలించారు.