
జనగామ అర్బన్, వెలుగు: సైన్స్‌ల్యాబ్‌లు విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని, వారి సొంత ఆలోచనలను రూపొందించుకోవడంలో సహాయపడుతాయని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. అమెరికా ఇండియా ఫౌండేషన్, అట్లాసియాన్ ఎన్జీవోలు ముందుకు వచ్చి రూ.15 లక్షలతో పెంబర్తి జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ లను బుధవారం కలెక్టర్ ఎన్జీవో ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధి రమేశ్, అట్లాస్ ప్రతినిధులు, హెచ్ఎం నాగరాణి, ఏఎంవో శ్రీనివాస్, ఎంఈవో శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పెంబర్తిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటే ప్రభుత్వం నగదును అకౌంట్ లోకి జమ చేస్తుందన్నారు. అంతకుముందు జనగామ పట్టణంలోని 18, 7 నెంబర్ గల రేషన్‌షాపులను ఆయన సందర్శించారు. బియ్యం సరఫరా, క్వాలిటీపై ఆరా తీశారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ సీసీఎల్ఏ ఆఫీస్ నుంచి రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి లోకేశ్‌కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.
ప్రోగ్రామ్‌లో ఈ నెల 5వ తేదీన జీపీవోలకు నియామక పత్రాలు జారీ చేయనున్నట్లు, ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలను అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోకేశ్‌కుమార్ సూచించారు. జిల్లాకు సంబంధించి 117 మంది గ్రామ పరిపాలనాధికారులుగా నియామక పత్రాలు తీసుకోనున్నారని, ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.