ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయండి : కర్ణన్

ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయండి :  కర్ణన్

నల్గొండ అర్బన్, వెలుగు: యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని   కలెక్టర్  ఆర్‌‌‌‌వీ కర్ణన్ ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేట్‌‌లో యాసంగిలో పంటల సాగు ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లపై  అగ్రికల్చర్, హార్టికల్చర్‌‌‌‌, సివిల్ సప్లై, డీఆర్‌‌‌‌డీఏ, సహకార శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో యాసంగి సీజన్‌‌లో 4,80,000 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అగ్రికల్చర్‌‌‌‌ అధికారులు కలెక్టర్ కు వివరించారు.

71 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా 24 వేల యూరియా స్టాక్ నిల్వలు ఉన్నాయని చెప్పారు.  అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ..  ఎరువుల డీలర్‌‌‌‌ దుకాణాలు, సొసైటీలను తనిఖీ చేస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఆయిల్ ఫామ్ పంట వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.  

తుపాన్‌ నేపథ్యంలో  రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని  వెంటనే కొనుగోలు చేయాలని,  ట్యాబ్ ఎంట్రీ లు పూర్తి చేసి రైతులకు త్వరగా చెల్లింపులు చేయాలని ఆదేశించారు. అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్ శ్రావణ్, హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్ సంగీత లక్ష్మి, సివిల్ సప్లై ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై డీఎం నాగేశ్వర రావు, డీసీవో కిరణ్ కుమార్ పాల్గొన్నారు.


కరాటేతో ఏకాగ్రత పెరుగుతుంది


కరాటేతో శారీరక దృఢత్వంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని  కలెక్టర్​ ఆర్‌‌‌‌వీ కర్ణన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్​ స్టేడియంలో  67 స్కూల్‌‌ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, 17 రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్‌‌ను  ప్రారంభించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్   మాట్లాడుతూ..   నేటి యువత ఎక్కువగా సెల్ ఫోన్లతో  టైమ్ స్పెండ్ చేస్తున్నందున శారీరక దృఢత్వం తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఏదో గేమ్ ఆడాలని సూచించారు. డీఈవో బొల్లారం భిక్షపతి, ఎస్​జీఎఫ్​ సెక్రటరీ వాసుదేవ రావు, జిల్లా కరాటే అసోసియేషన్ కార్యదర్శి దాసోజు నరసింహచార్యులు పాల్గొన్నారు.