స్టూడెంట్స్ కు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : కలెక్టర్ సంతోష్

స్టూడెంట్స్ కు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : స్టూడెంట్ లకు మెరుగైన విద్యతోపాటు క్వాలిటీ ఫుడ్ పెట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం మల్దకల్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కాలేజీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ లోని క్లాస్ రూమ్స్, కిచెన్ ఫుడ్ క్వాలిటీని పరిశీలించారు. విద్యార్థుల హాజరును సాంకేతికంగా పర్యవేక్షించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను నిత్యం ఉపయోగించాలని సూచించారు. స్కూల్ పరిసరాలను క్లీన్ గా పెట్టుకోవాలన్నారు.

హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్

అయిజ, వెలుగు : మాల పున్నం ఉందని స్కూల్ విద్యార్థులను ముందుగానే ఇంటికి పంపిన హెడ్మాస్టర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటన అయిజ మండల కేంద్రంలో జరిగింది. మంగళవారం ఐజ మండల కేంద్రంలోని హైస్కూల్ ను కలెక్టర్ సంతోష్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్​లో స్టూడెంట్స్​కనిపించకపోవడంతో షాకయ్యారు.  స్టూడెంట్స్​ను అనుమతి లేకుండా త్వరగా ఇంటికి ఎందుకు పంపించారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మాల పున్నమి కావడంతో విద్యార్థులు ఇంటికి వెళ్లారని హెడ్మాస్టర్ నిర్లక్ష్యంగా​సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్మాస్టర్ శేష పాణి శర్మను సస్పెండ్ చేయాలని డీఈవో కలెక్టర్ ఆదేశించారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి..

ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గ్రామ పరిపాలన అధికారుల కౌన్సిలింగ్ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి నిర్వహించి నియామకపత్రాలు అందజేశారు. జిల్లాలో గద్వాల నియోజకవర్గానికి 22 మంది,  అలంపూర్ నియోజకవర్గానికి 57 మంది.. మొత్తం పరిపాలన అధికారులను 79 మందిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. అపాయింట్​మెంట్ లెటర్ తీసుకొని వెంటనే విధుల్లో జాయిన్ కావాలని ఆదేశించారు.