
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం స్కీమ్ పై రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు.
వడ్ల కొనుగోలును వేగవంతంగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. వర్షాలు పడే అవకాశం ఉండడం వల్ల కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లను వేగవంతంగా కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించాలన్నారు. గన్నీ బ్యాగుల, లారీల కొరత లేకుండా సివిల్ సప్లై డీఎం చూసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగారావు, డీఎస్ఓ స్వామి కుమార్ తదితరులు పాల్గొన్నారు.