ఎరువుల నిల్వలను తనిఖీ చేయాలి : కలెక్టర్ సంతోష్

ఎరువుల నిల్వలను తనిఖీ చేయాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఎరువుల నిల్వలు, అవసరాలపై రివ్యూ చేశారు. జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతులు అవసరం మేరకే యూరియా కొనేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఏవో సక్రియ నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యనందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ సంతోష్ టీచర్లను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు జడ్పీ హై స్కూల్ ను ఆయన తనిఖీ చేశారు.  స్టూడెంట్స్ అటెండెన్స్​రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్థులు ఇంగ్లీష్​సరిగా చదవకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీరోజు యూనిఫాం వేసుకోవాలని పిల్లలకు సూచించారు.