
గద్వాల, వెలుగు: హాస్టల్లోని స్టూడెంట్‌లకు మెనూ ప్రకారం ఫుడ్ క్వాలిటీగా అందించాలని కలెక్టర్ సంతోష్ వార్డెన్లను ఆదేశించారు. సోమవారం గద్వాల టౌన్ లోని చింతలపేటలో ఉన్న షెడ్యూలు కులాల బాలుర వసతి గృహాన్ని, సాంఘిక సంక్షేమ హాస్టల్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, సరకుల నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్టూడెంట్ లకు అందిస్తున్న భోజనంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. తప్పనిసరిగా కామన్ డైట్ ప్లాన్ మెనూ ప్రకారం భోజనం ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నిషిత, వార్డెన్లు శీను, మధు, రామకృష్ణ ఉన్నారు.
క్వాలిటీలో రాజీ పడొద్దు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం గద్వాల టౌన్ లోని గంజిపేట వార్డు నెంబర్ 14 లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం నిర్మించుకోవాలని లబ్ధిదారులకు స్పష్టంగా చెప్పాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ దశరథం, హౌసింగ్ పీడీ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.