భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి : కలెక్టర్ సంతోష్

భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలపై మండలాల వారీగా తహసీల్దార్లతో బుధవారం కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. ఎన్ని పరిష్కరించారు, పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారని ఆరా తీశారు. 

కొన్ని మండలాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, కారణాలేంటని ప్రశ్నించారు. వివిధ సర్టిఫికెట్ల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి వారం రోజుల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టర్​సంతోష్​ ఆదేశించారు. పెండింగ్​రేషన్ కార్డుల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, సర్వే ల్యాండ్ రికార్డ్స్​ ఏడీ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.