
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత పనులపై అడిషనల్కలెక్టర్దేవసహాయంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేయాలని చెప్పారు.
గ్రామాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. రోడ్లు, నీరు, విద్యుత్, ఆరోగ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ విద్యుదీకరణ, మిషన్ భగీరథ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి, ఆర్అండ్ బీ ఈఈ దేశనాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
విద్యార్థినుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్బాదావత్సంతోష్హెచ్చరించారు. బుధవారం ఆయన నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. మెస్ కమిటీ ఆధ్వర్యంలో పెడుతున్న భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
బియ్యం స్టాక్ రిజిస్టర్‌ను చెక్ చేశారు. నాణ్యమైన భోజనం పెట్టాలని, పరిశుభ్రత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతీరోజు విద్యార్థినులను గమనిస్తూ ఉండాలని, వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని ప్రిన్సిపాల్, టీచర్లకు చెప్పారు. లక్ష్యాలను నిర్దేశించుకొని, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని విద్యార్థినులకు సూచించారు.