
గద్వాల, వెలుగు: ప్రతి స్టూడెంట్ ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ లో కాంస్య పతకం మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ఆర్ట్ ఫుల్ నెస్ వ్యాసరచన కార్యక్రమంలో జిల్లా నుంచి బాయ్స్ హై స్కూల్ కు చెందిన 107 మంది విద్యార్థులు పాల్గొనడం గర్వకారణమన్నారు.
ది కామన్వెల్త్ ఆఫ్ లైసెన్స్ ఆర్గనైజేషన్, ఆర్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంచర్త్య సంస్థలు గద్వాల బాయ్స్ హై స్కూల్ కు హెచ్ఎం రేణుకా దేవి, గైడ్ టీచర్ కృష్ణ కుమార్‌కు ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు. హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ స్టూడెంట్స్ కు అందించారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రత్నసింహారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.