మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా ఉంది.. ఆందోళన వద్దు : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా ఉంది.. ఆందోళన వద్దు : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్ నగర్ (నారాయణ పేట) వెలుగు: జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, ఆందోళన చెందవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  అందులో ఉన్న యూరియా బస్తాల నిల్వను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. యూరియా పక్క దారి పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల సహకారంతో వ్యవసాయ అధికారులు విసృతంగా తనిఖీలు చేపట్టాలని డీఏఓ జాన్ సుధాకర్ ను ఆదేశించారు.

 ఇంతవరకు పీఏసీఎస్ ద్వారా ఎన్ని టన్నుల యూరియా విక్రయించారని  ప్రశ్నించారు. 54 వేల టన్నుల యూరియాను  పంపిణీ చేసినట్లు అధికారి అశోక్ కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలోని దామరగిద్ద, కోస్గి, మద్దూరు, గుండుమల్, ధన్వాడ, మరికల్, తీలేరు, నర్వ, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు యూరియా విక్రయ కేంద్రాల వివరాలను జాన్ సుధాకర్ వివరించారు. 

ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 8 వేల టన్నుల యూరియా ను రైతులకు విక్రయించినట్లు పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలోనే 2 వేల టన్నుల యూరియా ను రైతులు కొనుగోలు చేశారని, అక్కడ వరి పంట సాగు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఆయా కేంద్రాలలో యూరియా  అందుబాటులో ఉందని చెప్పారు.