సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రి పీఎసీఎస్ ఎరువుల గోదాంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు పిల్లలమర్రి పీఎసీఎస్ ద్వారా 290.43 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం11.90 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.
ఇంకో 100 మెట్రిక్ టన్నుల యూరియా ఈ యాసంగి సీజన్‌కు సరిపోతుందని తెలిపారు. శుక్రవారం మరో రెండు లారీల యూరియా లోడ్ వస్తుందని ఏడీఏ కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ వెంట డీసీఓ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య, ఏడీఏ జ్ఞానేశ్వరి దేవి, ఏవో కృష్ణ సందీప్, ఏఈఓ స్వాతి, పీఎసీఎస్ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
