ఎలక్షన్​ డ్యూటీని నిష్పక్షపాతంగా నిర్వహించాలి : తేజస్​ నందలాల్​ పవార్

ఎలక్షన్​ డ్యూటీని నిష్పక్షపాతంగా నిర్వహించాలి : తేజస్​ నందలాల్​ పవార్

వనపర్తి, వెలుగు: నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎలక్షన్​ డ్యూటీ చేయాలని కలెక్టర్​ తేజస్​ నందలాల్​ పవార్​ సూచించారు. సోమవారం కలెక్టరేట్​లోని ప్రజావాణి హాల్​లో టెలీ కాన్ఫరెన్స్​ ద్వారా కోడ్​ ఆఫ్​ కండక్ట్, ఎంప్లాయీస్​ రోల్​పై దిశానిర్దేశం చేశారు. ఇంజినీరింగ్​ విభాగం ద్వారా కొత్తగా పనులు ప్రారంభించవద్దని, ఇప్పటి వరకు శాంక్షన్​ అయిన పనుల వివరాలను అందించాలని సూచించారు.

గవర్నమెంట్​ వెహికల్స్​ ప్రజాప్రతినిధులు వాడవద్దని, ఈ విషయం తన దృష్టికి వస్తే సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్​ స్టేషన్లలో ఓటర్లకు, వికలాంగులకు, వయోవృద్దులకు సౌలతులు కల్పించాలన్నారు. ఎస్పీ రక్షితకృష్ణమూర్తి మాట్లాడుతూ ఎలక్షన్​ కోడ్​ రెండు నెలల పాటు ఉంటుందని, పోలీస్, రెవెన్యూ సిబ్బంది కో-ఆర్డినేషన్​తో పని చేయాలని కోరారు.

 నియమాలు పాటించాలి..

జిల్లాలోని ప్రింటింగ్​ ప్రెస్​, ఫ్లెక్సీ ప్రింటింగ్​ ఓనర్లు ఎన్నికల కమిషన్​ మార్గదర్శకాలకు లోబడి  పనిచేయాలని జిల్లా అడిషనల్​ కలెక్టర్​ నగేశ్​​ ఆదేశించారు. ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర మెటీరియల్​ ప్రింటింగ్​ చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణకర్త పేర్లు, సెల్​ నంబర్లు ముద్రించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అడిషనల్​ కలెక్టర్​ సంచిత్​ గంగ్వార్, డీడబ్ల్యూవో లక్ష్మిబాయి పాల్గొన్నారు.