
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లా స్వచ్ఛతలో ఆదర్శంగా నిలవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్న ‘స్వచ్ఛతాహీ సేవా’ కార్యక్రమాలపై రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 రోజుల్లో గ్రామాలు, మున్సిపాలిటీల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు.
చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయడం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు ఇతర ప్రాంతాలను శుభ్రపరచాలన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, డీపీవో భిక్షపతి పాల్గొన్నారు.
అమ్మ పేరుతో మొక్క నాటండి
జిల్లాలోని గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లలో ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఓ మొక్క నాటి బాధ్యతగా పెంచాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ లో నిర్వహించిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంలో పాల్గొని స్టూడెంట్లతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లలో ఇప్పటివరకు 20 ,327 మొక్కలు నాటినట్లు చెప్పారు.