భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్ ,వెలుగు : సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీఓ లోకేశ్వర్ రావు లతో కలిసి తహసీల్దార్లతో వివిధ అభివృద్ధి పనుల కోసం సేకరించిన భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్, లావుని పట్టా భూముల వివరాల నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం సేకరించిన భూములు, చెరువులు, ప్రాజెక్టులు, కాలువలు, రహదారులు, రైల్వే లైన్ నిర్మాణ పనులలో సేకరించిన భూములు, ప్రభుత్వ భూములు, సీలింగ్, లావుని పట్ట, దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాలను 22 ఎ నిషేధిత జాబితాలో నమోదు చేయాలని తెలిపారు. ఏ ఒక్క సర్వే నెంబరు తప్పిపోకూడదని, గ్రామాల వారీగా నిషేధిత జాబితాలలో ఉన్న భూముల వివరాలను పరిశీలించాలని తెలిపారు.