
- ప్రభుత్వం పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: తపాలా శాఖ ద్వారా కేంద్రం అందిస్తున్న ప్రభుత్వ పథకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్దీపక్ తివారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ కొట్టె శ్రీనివాస్ తో కలిసి పోస్టల్ శాఖ సేవలపై రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సేవలను పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాలు తెరవడం, ప్రధానమంత్రి కిసాన్, గ్యాస్ రాయితీ, అన్ని రకాల బిల్లు చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. అనేక రకాల జీవిత బీమా అవకాశాలు కల్పించిందని, ఏడాదికి రూ.565 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.345 చెల్లిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం తపాలా శాఖ కల్పిస్తోందని వివరించారు. జిల్లాలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ సేవలు లభిస్తాయని, ప్రజల సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను అడిషనల్ కలెక్టర్ డేవిడ్తో కలిసి పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీలు తెరిచి అందులో భద్రపరిచిన ఓటింగ్ యంత్రాల బాక్సులను చెక్ చేశారు. గోదాం వద్ద 24 గంటలపాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, పటిష్టమైన పోలీస్ భద్రత ఉందని అన్నారు.