నిజామాబాద్, వెలుగు : జిల్లాలో డ్రగ్స్, మత్తుపదార్థాల నిరోధానికి ప్రజలతో కలిసి నడుద్దామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన నషా ముక్త్ అభియాన్ జిల్లా సమన్వయ కమిటీ మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలకు పెనుముప్పు వాటిల్లుతుందన్నారు. అవగాహన కార్యక్రమాలు పెంచి ప్రజల్లో మార్పు తేవాలన్నారు.
కల్తీ కల్లు వాడకంపై కూడా ప్రచారం చేయాలన్నారు. సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ మత్తుపదార్థాలు కనబడితే 14446 టోల్‌ఫ్రీకి సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్‌బీ, డీవీఈవో రవికుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
స్పెషల్ రివిజన్‌పై రోజువారి సమీక్ష
లోపాలు లేకుండా ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. పురోగతిని ప్రతి రోజు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. శనివారం సీఈసీ అదనపు కమిషనర్ లోకేశ్‌కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జిల్లా వివరాలు తెలిపారు. ఇప్పటి వరకు 50 శాతం మ్యాపింగ్ చేశామన్నారు. అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, హౌసింగ్ పీడీ పవన్‌కుమార్, ఎలక్షన్ సూపరింటెండెంట్ ధన్వాల్ తదితరులు పాల్గొన్నారు.
