- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సహకారంతో స్టేట్ గవర్నమెంట్ ఈనెల 22న నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయా శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్లో కలెక్టర్ మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పువాటిల్లకుండా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రకృతి విపత్తులప్పుడు ప్రాణనష్ట నివారణకు ఏ మేరకు చర్యలు తీసుకోవాలో మాక్ ఎక్సర్సైజ్ స్పష్టం చేస్తుందన్నారు.
తెలియని విషయాలు తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. ఇందుకోసం రెవెన్యూ, పోలీస్, ఇగిరేషన్, ఫైర్, ఎన్పీడీసీఎల్, మెడికల్, సివిల్ సప్లయ్, ఆర్అండ్బీ శాఖలు కీలక పాత్ర పోషించాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్, జడ్పీ సీఈవో సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.
