మక్కలు ఆరబెట్టి తెచ్చి..మద్దతు ధర పొందాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

మక్కలు ఆరబెట్టి తెచ్చి..మద్దతు ధర పొందాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
  •   మునిపల్లి, పిప్రిలో మక్కల కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి 

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ డివిజన్ లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను బుధవారం  కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. జక్రాన్ పల్లి మండలం మునిపల్లి, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​ రైతులు, నిర్వాహకులతో మాట్లాడారు. కనీస మద్దతు ధర అందించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 14 శాతానికి కన్నా తక్కువ తేమ ఉండేలా మక్కలను ఆరబెట్టి, శుభ్రపరిచి కేంద్రాలకు తేవాలన్నారు. కేంద్రాల్లో రైతులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

రైతులు తెచ్చిన పంట నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం జరిపించి, ట్యాబ్ ఎంట్రీ చేయాలని కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్​ సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావు, మార్క్ ఫెడ్ డీఎం మహేశ్ కుమార్, సొసైటీ చైర్మన్​ హేమంత్​రెడ్డి రైతులు  ఉన్నారు. 

ఎడపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన 

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని సింగిల్​విండో , ఐకేపీ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్​సప్లై ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మితో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఉంటే వెంటనే ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని కోరారు. ధాన్యం విక్రయించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సాయన్న, స్థానిక తహసీల్దార్ దత్తాద్రి, సింగిల్​ విండో చైర్మన్​ మల్కారెడ్డి, ఐకేపీ ఏపీఎం రాజేందర్,  తదితరులు పాల్గొన్నారు.