రైతుల అకౌంట్స్​ ప్రాబ్లమ్స్​ క్లియర్​ చేయండి: ​ వినయ్​ కృష్ణారెడ్డి

రైతుల అకౌంట్స్​ ప్రాబ్లమ్స్​ క్లియర్​ చేయండి: ​ వినయ్​ కృష్ణారెడ్డి

యాదాద్రి, వెలుగు: రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్స్​ ప్రాబ్లమ్స్ 15లోగా​ క్లియర్​ చేయాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, అగ్రికల్చర్​ ఆఫీసర్లతో  రుణమాఫీపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదని కలెక్టర్ బ్యాంకర్లను ప్రశ్నించారు.  దీంతో ఎల్​డీఎం రామకృష్ణ రుణమాఫీ వివరాలను వెల్లడించారు. జిల్లాలో 2018 డిసెంబర్​ 11 నాటికి రుణం పొందిన 39,186 మంది రైతులకు రూ. 202. 46 కోట్లు మాఫీ కావాల్సి ఉందన్నారు. 

అయితే బ్యాంకులు విలీనం కావడం వల్ల ఐఎఫ్​ఎస్సీ నెంబర్లు, లోన్​ రెన్యువల్​ చేసుకోవడం వల్ల అకౌంట్స్​ నెంబర్లు మారిపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు.  అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ అగ్రికల్చర్​ ఆఫీసర్లు, బ్యాంకర్లు  జాయింట్‌గా 2018 నాటి రైతుల ఖాతాల నెంబర్లు గుర్తించి, రుణాలు మాఫీ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కర్​రావు, డీఏవో అనురాధ, బ్యాంకర్లు, అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఉన్నారు.