నామినేషన్ల ప్రక్రియపై శిక్షణ : వి.పి. గౌతమ్

నామినేషన్ల ప్రక్రియపై శిక్షణ : వి.పి. గౌతమ్

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో చేపట్టే నామినేషన్ ప్రక్రియపై ఆఫీసర్లు అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు వి.పి. గౌతమ్, డాక్టర్​ ప్రియాంక అల సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నామినేషన్ దాఖలు ప్రక్రియపై రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ ఆఫీసర్లతో సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి  మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు  తీసుకోవాలని చెప్పారు.

ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలన్నారు. జనరల్​, బీసీ క్యాండెట్లు రూ. 10వేలు డిపాజిట్, ఎస్సీ, ఎస్టీ క్యాండెట్లు రూ. 5వేలు డిపాజిట్​ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ దాఖల సమయంలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ లో ఎలాంటి ఖాళీలు  లేకుండా చూసుకోవాలని చెప్పారు. నామినేషన్ల స్క్రూటీని రిటర్నింగ్ అధికారి మాత్రమే చేయాలన్నారు. భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.  ఖమ్మంలో అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, రిటర్నింగ్ అధికారులు ఆదర్శ్ సురభి, బి. సత్యప్రసాద్, జి. గణేశ్, అశోక్ చక్రవర్తి, రాజేశ్వరి

శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, సీపీవో ఏ. శ్రీనివాస్, డీసీఓ విజయకుమారి, కలెక్టరేట్ ఏవో అరుణ, భద్రాద్రికొత్తగూడెంలో పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల రిటర్నింగ్​ ఆఫీసర్లు ప్రతీక్​ జైన్​, రాంబాబు, శిరీష, మంగీలాల్​, కార్తీక్​, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ధారా ప్రసాద్​, డీటీ రంగ ప్రసాద్​, నవీన్​ పాల్గొన్నారు.