
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో పలు రంగాలకు చెందిన కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. సినిమా రంగం పై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉండడంతో షూటింగ్ లు లేక సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ కార్మికులకు తన వంతు సాయంగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మూడు లక్షల విరాళాన్ని ప్రకటించారు.
సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) ఈ వి్రాళాన్ని అందజేయనున్నట్టు బ్రహ్మానందం తెలిపారు. ఇప్పటికే ఈ చారిటీకి సినీ రంగానికి చెందిన పలువురు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. లాక్ డౌన్ తో ఎవరూ బయట కు రాలేని పరిస్థితులుండటం వల్ల కార్మికుల ఇంటి వద్దకే వారికి కావాల్సిన సరుకులు అందజేయడం జరుగుతుందని చిరంజీవి రీసెంట్‌గా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు