ఒక్క టెస్లా కోసం పాలసీలు మార్చం : పీయూష్ గోయెల్

ఒక్క టెస్లా కోసం పాలసీలు మార్చం : పీయూష్ గోయెల్
  •     కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయెల్

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు నచ్చినట్టు పాలసీలను మార్చమని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. అన్ని ఎలక్ట్రిక్  వెహికల్స్ తయారీ కంపెనీలను ఆకర్షించేలా చట్టాలు, టారిఫ్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ఉంటాయని చెప్పారు. కాగా, మొదట తమ కార్ల దిగుమతులపై  కస్టమ్స్ డ్యూటీలో 70 శాతం  రాయితీని ఇవ్వాలని టెస్లా ప్రభుత్వాన్ని కోరుతోంది. 40 వేల డాలర్ల కంటే తక్కువ విలువున్న కార్ల కోసం ఈ రాయితీ అడుగుతోంది. 

అదే40 వేల డాలర్ల కంటే ఎక్కువ విలువున్న కార్లపై కస్టమ్స్ డ్యూటీలో 100 శాతం రాయితీ కోరుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని గోయెల్ అన్నారు. అలా అని ఏ ఒక్క కంపెనీ కోసమో పాలసీల్లో మార్పులు చేయలేమని చెప్పారు. యూకే, యూరప్‌‌‌‌, జపాన్‌‌‌‌, కొరియా వంటి దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇనీషియేటివ్స్ రెడీ చేస్తున్నామన్నారు.