తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర

తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర

న్యూఢిల్లీ: కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.44.50 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రో ధరలపై సమీక్షించి ప్రతినెలా 1వ తేదీన కొత్త ధరలు ప్రకటించే ఆయిల్ కంపెనీలు.. ఇవాళ ఆగస్టు 1వ తేదీన వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. హోటళ్లు, తోపుడు బండ్లపై టీ, టిఫిన్ సెంటర్లు నడుపుకునే వారికి ఉపశమనం కలిగేలా కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించాయి. 
అయితే గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం రూ.2242 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర తాజా తగ్గింపుతో 2,197.50కు చేరుకుంది. డొమెస్టిక్ సిలిండర్ ధరను గత నెల 50 రూపాయలు పెంచడంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరుకుంది. దీని ధరను యధాతధంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. 

19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై 36 రూపాయిలు తగ్గించగా హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ పై 44 రూపాయిల 50 పైసల ధర తగ్గింది. దీంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 2 వేల 242 రూపాయిలకు చేరింది. ఢిల్లీలో 36 రూపాయిలు తగ్గడంతో 2 వేల 12 రూపాయిల 12 పైసలకు చేరింది.