దేశవ్యాప్తంగా ప్రతినెల మాదిరిగానే చమురు కంపెనీలు గ్యాస్ ధరల్లో అక్టోబర్ 1న మార్పులు తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. సామాన్యుడికి గుదిబండలా ఎల్పీజీ గ్యాస్ బండ మారింది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల ముందు అక్టోబరు నెలలో సిలిండర్ల ధరలు పెరగటం ప్రజలపై భారాన్ని పెంచుతోంది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.48.50 లు పెరిగింది. పెరిగిన ధరలు ఈరోజు (అక్టోబర్ 1) నుంచి అమలు అవుతున్నాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రమే పెరిగాయి. గృహ అవసరాలకు వినియోగించే 14 కేజీల సిలిండర్ ధర స్థిరంగా ఉంది.
పెంచిన రేట్లతో ధరలు ఇలా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. పెరిగిన ధరల ప్రకారం.. రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలపై ప్రభావం చూపుతుంది.
- హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967 అయ్యింది. 14.2 కేజీల గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ రేటు రూ.855గా ఉంది.
- విజయవాడలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రేటు పెరిగిన తర్వాత రూ.1,901లక లభిస్తోంది. 14.2 కేజీల సిలిండర్ రేటు రూ.827.50 వద్ద కొనసాగుతోంది.