
దసరా ముందు సిలిండర్ ధరులు షాకిస్తున్నాయి. సిలిండర్ ధరల రివిజన్ లో భాగంగా బుధవారం ( అక్టోబర్ 1) దేశ వ్యాప్తంగా ధరలు పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. కమర్షియల్ LPG సిలిండర్ల ధరలను పెంచినట్లు కంపెనీలు ప్రకటించాయి. పండుగ సీజన్‌కు ముందే సిలిండర్ల ధరలు పెరగటంతో కమర్షియల్ వంట గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడే హోటళ్ళు, రెస్టారెంట్లు, అనేక వ్యాపారాలపై ఎఫెక్ట్ పడనుంది.
కమర్షియల్ సిలిండర్ల ధరల పెరుగుదల:
పెంచిన రేట్ల ప్రకారం, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర 15 రూపాయల 50 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.1,595.50 కు చేరుకుంది. ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ధరలు పెరిగాయి. అయితే ఆయా రాష్ట్రాల ట్యాక్సుల ఆధారంగా ధరల్లో అటు ఇటు కొంత మార్పు ఉండవచ్చు.
హైదరాబాద్ లో రేట్లు:
ఎల్పీజీ సిలిండర్ రేట్ల పెంపుతో హైదరాబాద్ లోనూ ధరలు పెరిగాయి. మంగళవారం (సెప్టెంబర్ 30) వరకు హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802 గా ఉంది. పెంచిన రేట్లతో 1817.50కు చేరుకుంది.
డొమెస్టిక్ సిలిండర్లపై ప్రభావం:
మార్కెటింగ్ కెంపెనీలు కమర్షియల్ సిలిండర్లపైనే రేట్లు పెంచడంతో.. గృహ అవసరాలకు (డొమెస్టిక్) వినియోగించే సిలిండ్లపై ఎలాంటి ప్రభావం లేదు. ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ల ధర 905 రూపాయలుగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు, విదేశీ మారకపు రేట్లలో మార్పుల కారణంగా ప్రతి నెల ప్రారంభంలో మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయి.